VIDEO: 'రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి'
MNCL: తెలంగాణ మత్స్యకారుల కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం గురువారం మంచిర్యాలలో జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 25, 26, 27 తేదీల్లో కరీంనగర్‌లో జరగనున్న రాష్ట్ర మహాసభల పోస్టర్లను సంఘం జిల్లా కార్యదర్శి బోడంకి చందు విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ సభల్లో మత్స్యకారుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.