రేపు ధాన్యం కొనుగోలు ప్రారంభం: కలెక్టర్

రేపు ధాన్యం కొనుగోలు ప్రారంభం: కలెక్టర్

W.G: ఈ నెల 3వ తేదీ సోమవారం తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులో మంత్రి నాదెండ్ల మనోహర్ ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని కలెక్టర్ నాగరాణి తెలిపారు. పౌరసరఫరాల శాఖ మంత్రి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి 7337359375 వాట్సాప్ నంబర్‌కు "HI" అని సందేశం పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.