జల వనరుల శాఖ మంత్రి నిమ్మలతో నారాయణ భేటీ

NLR: నగరానికి విచ్చేసిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. జిల్లాకు సంబంధించి పలు సాగునీటి ప్రాజెక్టులపై వారు చర్చించారు.