కల్లెడలో విషాదం.. ఒకే రోజు ఇద్దరు మృతి

కల్లెడలో విషాదం.. ఒకే రోజు ఇద్దరు మృతి

WGL: పర్వతగిరి మండలంలోని కల్లెడలో ఒకే రోజు ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గురువారం గ్రామానికి చెందిన రైతు మద్దెల శ్రీనివాస్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోగా.. అదే రోజు దినసరి కూలీ అయిన బాల్లె వెంకటయ్య చేనులో పత్తి ఏరుతుండగా గుండెపోటుతో కుప్పకూలాడు. ఇద్దరి అంత్యక్రియలు శుక్రవారం ఒకే రోజు నిర్వహించారు.