RRR కస్టడీ కేసు.. విచారణకు సునీల్ హాజరు

RRR కస్టడీ కేసు.. విచారణకు సునీల్ హాజరు

AP: YCP హయాంలో రఘురామకృష్ణరాజును CID పోలీస్ కస్టడీలో హింసించిన కేసులో సీనియర్ IPS అధికారి PV సునీల్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు గుంటూరు CCS PSకు వెళ్లిన ఆయనను విచారణాధికారి, విజయనగరం SP దామోదర్ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. ఈ నెల 4నే విచారణకు రావాలని గతంలో ఆయనకు నోటీసులు ఇవ్వగా.. గడువు కావాలని కోరారు. ఈ క్రమంలో 15న హాజరుకావాలని మళ్లీ నోటీసులు పంపగా ఇవాళ హాజరయ్యారు.