చిచ్చర పిడుగు.. రెండున్నర ఏళ్లకే వరల్డ్ రికార్డ్
TG: నల్గొండ జిల్లాలోని జొన్నలగడ్డగూడెం గ్రామానికి చెందిన అక్షయ అనే రెండన్నరేళ్ల చిన్నారి అద్భుత ప్రతిభతో ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిన్నారి ఏకంగా 104 దేశాల జెండాలు, స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలు గుర్తించగలదు. అంతేకాదు దేశాలు, ఖండాల పేర్లను కూడా సులభంగా చెప్పగలుగుతోంది. ఈ అసాధారణ ప్రతిభ కారణంగా అక్షయ ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.