మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈటెల రాజేందర్ రోడ్ షో
ములుగు జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రోడ్ నేడు రోడ్డు షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ను ప్రజలు బొంద పెట్టారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి బాటలో నడుస్తోందని పేర్కొన్నారు.