ప్రభుత్వం ప్రజలను మోసగించింది: వంగా గీత

KKD: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగించిందని పిఠాపురం వైసీపీ ఇంఛార్జ్ వంగా గీత విశ్వనాథ్ మండిపడ్డారు. పిఠాపురం వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు.