భారత్ గెలుపు మాకు స్ఫూర్తి: పాక్ మాజీ కెప్టెన్
భారత మహిళల వరల్డ్ కప్ విజయం ఆంక్షలు ఎదుర్కొంటున్న అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ అమ్మాయిలు ఇప్పటికీ పరిమితులను ఎదుర్కొంటున్నారని, ఇకనైనా వారి పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. WWC విజయం ప్రారంభమేనని, భారత మహిళల జట్టు ఇంకా గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించాడు.