4 సార్లు ఎమ్మెల్యే.. ఆ తర్వాత సర్పంచ్!

4 సార్లు ఎమ్మెల్యే.. ఆ తర్వాత సర్పంచ్!

TG: సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండకు చెందిన ఉప్పల మన్సూర్ ఉమ్మడి ఏపీలో 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సూర్యాపేట నుంచి వరుసగా 4 సార్లు గెలిచారు. అనంతరం 1995లో తన సొంతూరులో సర్పంచ్‌గా పనిచేశారు. తనకు ఇష్టం లేకున్నా ఊరిలో వాళ్లంతా కలిసి ఒప్పించి మరీ సర్పంచ్‌ను చేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన తర్వాత సర్పంచ్‌గా సేవలందించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.