దేవరకొండ ఆసుపత్రిలో డీసీహెచ్ఎస్ తనిఖీ
దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా డీసీహెచ్ఎస్ డా.మాతృనాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రికార్డులు, ల్యాబ్ పరీక్షలను పరిశీలించి, ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్యంపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా. రవి ప్రకాష్ ఉన్నారు.