'డ్రైవర్లు అప్రమత్తతో వాహనాలను నడపాలి'

CTR: విద్యాసంస్థల్లో పనిచేసే డ్రైవర్లు అప్రమత్తతో వాహనాలను నడపాలని MVI సుప్రియ సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా శుక్రవారం పుంగనూరులోని ఓ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే డ్రైవర్లతో సమావేశం నిర్వహించి రహదారి భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. రాష్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ లాంటివి చేయొద్దని ఆమె సూచించారు.