కొణిజర్లలో లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

KMM: మొక్కల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా కొట్టిన సంఘటన కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపంలో ఆదివారం జరిగింది. ఎస్సై సూరజ్ తెలిపిన వివరాల ప్రకారం.. UP నుంచి రాజమండ్రికి మొక్కలు లోడుతో వెళ్తున్న లారీ పల్లిపాడు పెట్రోల్ బంక్ సమీపాన అదుపుతప్పి రోడ్డు మీద బోల్తా కొట్టింది. ఆ సమయంలో వాహనాలేవి రాకపోవడంతో ఎవరూ గాయపడకుండా పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.