14 బాటిళ్ల రక్తం ఎక్కించి ప్రాణాలు కాపాడిన వైద్యులు
MBNR: జిల్లా దేవరకద్రకు చెందిన భాగ్యశ్రీకి ప్రసవం తర్వాత తీవ్రమైన రక్తస్రావం జరిగి ప్రాణాపాయ స్థితిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రక్తహీనతతో ఆమె రక్త స్థాయి 5 గ్రా/ డెసిలీటర్‌కు పడిపోగా, కలెక్టర్ ఆదేశాలపై వైద్యులు వెంటనే చర్యలు తీసుకున్నారు. 12 గంటల్లో 14 బాటిళ్ల రక్తం ఎక్కించి, నాలుగు రోజుల పాటు కృషి చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం భాగ్యశ్రీ ఆరోగ్యంగా ఉన్నారు.