పేకాట ఆడుతున్న ఏడుగురు అరెస్ట్

పేకాట ఆడుతున్న ఏడుగురు అరెస్ట్

ప్రకాశం: తర్లుపాడు మండలం పాతేపురం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని గురువారం రాత్రి ఎస్సై బ్రహ్మనాయుడు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,24,700 నగదు, మూడు ద్విచక్ర వాహనాలు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.