కోటగుళ్లలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు

కోటగుళ్లలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు

BHPL: గణపురం మండలం కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన కోటగుళ్లలోని గణపేశ్వరాలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేసి, హారతులు ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయంలో రద్దీ నెలకొంది.