VIDEO: పొంగిపొర్లుతున్న మురుగు కాలువలు
ASF: కాగజ్ నగర్ మున్సిపాలిటీ 8వ వార్డులో మురుగు కాలువలు పొంగిపొర్లుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అంబేద్కర్ చౌక్ నుంచి కౌసర్ మజీద్ వెళ్లే దారిలో 4 రోజులుగా మురుగు నీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. సాక్షాత్తూ వార్డు కౌన్సిలర్ ఇంటి ముందే ఈ దుస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.