మాపై కేసులు పెట్టి భయపెడుతున్నారు: సునీత
TG: ఎన్నికల ప్రచారంలో తన పిల్లలు తిరుగుతుంటే వాళ్లపై ఎన్నో కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. కష్టకాలంలో గోపీనాథ్ ప్రజల వెంటే ఉన్నారని తెలిపారు. గోపీనాథ్ ఆశయ సాధనకు తనను గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే జూబ్లీహిల్స్ అభివృద్దికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.