ప్రారంభానికి నోచుకోని పంచాయతీ కార్యాలయం

ప్రారంభానికి నోచుకోని పంచాయతీ కార్యాలయం

VZM: వేపాడ మండలం అరిగి పాలెం పంచాయతీ కార్యాలయం ప్రారంభానికి నోచుకోవడం లేదు. భవన నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రారంభించడానికి ప్రజాప్రతినిధులు ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించి ప్రజా సేవకు వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.