గాజులరామారంలో మహిళ అదృశ్యం

గాజులరామారంలో మహిళ అదృశ్యం

RR: గాజులరామారం పరిధిలో మహిళ అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. MHBD జిల్లా ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన నల్ల వెంకన్న, రాధ దంపతులు తమ కూతురుతో కలిసి గాజులరామారం ఎలిగెన్స్ మోడీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. మతి స్థిమితం తక్కువగా ఉన్న నల్ల రాధ (50) ఆదివారం ఉదయం 10:48కు ఎరుపు రంగు చీరతో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.