ఏడాదిపాటు వందేమాతరం ఉత్సవాలు.. ప్రధాని శ్రీకారం
భారత జాతీయ గేయం 'వందేమాతరం' రచించి రేపటికి 150 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రేపు ఉదయం 9.30 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఈ క్రమంలో మోదీ ప్రత్యేక స్టాంపును, నాణేన్ని విడుదల చేస్తారు. స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ఈ గేయం ఉత్సవాలు రేపటి నుంచి 2026 నవంబర్ 7 వరకు దేశమంతా జరగనున్నాయి.