ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

పార్వతీపురం ఆర్టీసీ డిపోలో ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రబంధకుడు మాట్లాడుతూ.. ఓటు అనేది వజ్ర ఆయుధం అని అన్నారు. దేశ అభివృద్ధికి ఓటు ద్వారా సరైన నాయకుడిని ఎన్నుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ లక్ష్మణరావు, భద్రత సిబ్బంది పాల్గొన్నారు.