'శుద్ధి చేసిన నీటిని మాత్రమే సరఫరా చేయాలి'

'శుద్ధి చేసిన నీటిని మాత్రమే సరఫరా చేయాలి'

KRNL: పత్తికొండ మండలం కొత్తపల్లి గ్రామంలో మంచినీటి సరఫరా కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ డా. సిరి పరిశీలించారు. ప్రజలకు అందుతున్న తాగునీటి నాణ్యత, సరఫరా విధానం, పంపిణీ వ్యవస్థ పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శుద్ధి చేసిన తాగునీటిని నిరంతరం సరఫరా చేయాలని ఆదేశించారు.