రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

రెండు లారీలు ఢీ.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

MHBD: నాగపూర్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ లారీ ప్రమాదానికి గురయింది. తొర్రూరు పట్టణం వద్ద గణేష్ వైన్స్ నుంచి వ్యక్తి బయటకు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న రాజస్థాన్‌కు చెందిన మరో లారీ ముందున్న లారీని ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన లారీ డ్రైవర్ సీట్లో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అస్పత్రికి తరలించారు.