మండలంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

E.G: గోకవరం మండలంలో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శాంతిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫొటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ జాక్యిస్ మండ్ డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శాంతిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రఫీలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు.