ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రాన్ని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌

ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రాన్ని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌

VZM: ఇంట‌ర్ మీడియ‌ట్ ప‌రీక్షా కేంద్రాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి గురువారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. స్థానిక‌ తోట‌పాలెంలోని శ్రీ‌నివాస జూనియ‌ర్ క‌ళాశాల‌ను క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న తీరును ప‌రిశీలించారు. ప‌రీక్ష వివ‌రాలు, విద్యార్ధుల హాజ‌రు త‌దిత‌ర అంశాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.