జాతీయరహదారిపై ప్రమాద ప్రాంతాల గుర్తింపు.. భద్రతపై దృష్టి
WGL: రాయపర్తి మండల కేంద్రంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు పోలీసులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ నరసయ్య, సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.