VIDEO: నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాల్వ నీటి విడుదల పెంపుదల
కామారెడ్డి జిల్లా జుక్కల్ సెగ్మెంట్‌లోని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాల్వ ద్వారా రబీ పంటల కోసం నీటి విడుదలను 1500 క్యూసెక్కుల నుంచి 1800 క్యూసెక్కులకు పెంచినట్లు ప్రాజెక్టు ఏఈ సాకేత్ ఆదివారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం1405 అడుగులు కాగా, ప్రస్తుతం 1398.77 అడుగుల నీరు నిల్వఉంది. టీఎంసీల్లో17.802 టీఎంసీలకు గాను 10.082 టీఎంసీల నీరు ఉందన్నారు.