ఐనవోలులో దోమల నివారణకు ఎబెట్ పిచికారీ
GNTR: దోమల నివారణ కోసం తుళ్లూరు(M) ఐనవోలు గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం ఉదయం ఎబెట్ (EBT) మందును పిచికారీ చేశారు. ఇది దోమలను నియంత్రించడానికి ఉపయోగించే ఒక రసాయన క్రిమిసంహారక మందు అని కార్యదర్శి సాంబిరెడ్డి చెప్పారు. ముఖ్యంగా డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా నిరోధించడానికి ఉపయోగిస్తారని పేర్కొన్నారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.