INSPIRATION: నెల్సన్ మండేలా

INSPIRATION: నెల్సన్ మండేలా

నెల్సన్ మండేలా.. దక్షిణాఫ్రికాకు చెందిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఫలితంగా 27 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. 1990లో విడుదలైన తర్వాత దక్షిణాఫ్రికాలో ప్రజాస్వామ్య స్థాపనకు నాయకత్వం వహించారు. 1994లో అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఇలా ప్రమాణం చేసిన తొలి నల్లజాతీయుడిగా నిలిచారు. 1993లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.