నిర్మల్ జిల్లాకు రాంజీ గోండ్ పేరు పెట్టాలి: TAGS
ADB: నిర్మల్ జిల్లాకు తొలి స్వాతంత్య్ర సమర యోధుడు, ఆదివాసీల పోరాట వీరుడు మర్సుకోలా రాంజీ గోండ్ పేరు పెట్టాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. ఆదిలాబాద్‌లోని CITU కార్యాలయంలో గురువారం సమావేశమై మాట్లాడారు. రాంజీ గోండ్ పేరుతో జిల్లాలో మ్యూజియం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.