ప్రజావాణిలో 115 ఫిర్యాదుల స్వీకరణ
MDCL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేడు నిర్వహించిన ప్రజావాణి 115 ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను లా ఆఫీసర్ చంద్రావతితో కలిసి జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులు వచ్చిన ఫిర్యాదులపై తదుపరి చర్యలను తీసుకోవాలని ఆదేశించారు.