'షుగర్ బేబీ' లిరికల్ వీడియో రిలీజ్
మణిరత్నం, కమల్‌హాసన్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం 'థగ్ లైఫ్'. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మూవీ సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారంలో భాగంగా 'షుగర్ బేబీ' అంటూ సాగే లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు.