జిల్లా కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

జిల్లా కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

KMM: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు అధిక సంఖ్యలో రైతులు వస్తున్న నేపథ్యంలో, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని మంత్రి తుమ్మల జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సుమారు 200 కేంద్రాల ద్వారా మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని, సేకరించిన మొక్కజొన్నను గోదాములకు వేగంగా తరలించాలన్నారు.