బెల్ట్ షాప్ పై అధికారులు దాడి.. వ్యక్తి అరెస్ట్

VZM: బొబ్బిలి మండలం అలజంగి గ్రామంలో నడుస్తున్న మద్యం బెల్టు షాప్‌లో ఎస్సై రాముడు తన సిబ్బందితో కలిసి మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒక వ్యక్తి వద్ద నుంచి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశారు. మండల పరిధిలో ఎక్కడా బెల్ట్ షాపులు ఉండరాదని, ఎవరూ కూడా పరిమితికి మించి మద్యం దుకాణాలు కలిగి ఉండరాదని ఎస్సై స్పష్టం చేశారు.