హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే

హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే

చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించారు. దేశభక్తిని పెంపొందించేలా ప్రతి ఒక్క యువత హర్ ఘర్ తిరంగాలో భాగస్వామ్యం కావాలన్నారు. ప్రతి ఇంట, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలపై మువ్వన్నెల జెండా ఎగురు వేయాలన్నారు. గాంధీ విగ్రహం నుంచి నాగయ్య కళాక్షేత్రం మీదుగా ర్యాలీని కొనసాగించారు.