KGBVలో నీటి సమస్య తీర్చాలి: NSUI
NZB: భీమగల్ KGBVలో సమస్యలపై మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్‌కు శుక్రవారం వినతి పత్రం ఇచ్చినట్లు NSUI జిల్లా ఉపాధ్యాకుడు రెహమాన్ తెలిపారు. కస్తూర్బాలో నీరు లేక విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్నానాలకు, కనీస అవసరాలకు నీరు లేక అవస్థలు పడుతున్నారన్నారని. ఏ ఒక్క అధికారి విద్యార్థుల బాధలు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.