'అన్నం వృథా చేయకండి'

అన్నమయ్య: అన్నం వృథా చేయకుండా పేదలకు పంచాలని చిట్వేల్ MRO స్పందన రెడ్డి సూచించారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద చిట్వేల్ హెల్ప్‌లైన్ సొసైటీ ఆధ్వర్యంలో ఫుడ్ బ్యాంక్, చల్లని తాగునీరు ఏర్పాటు చేశారు. MRO మాట్లాడుతూ.. ఎవరి ఇంట్లోనైనా శుభకార్యాలు జరిగినప్పుడు మిగిలిన అన్నం ఫుడ్ బ్యాంక్‌కు అందజేస్తే నిరుపేదలకు పంచుతామన్నారు.