నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
SKLM: నరసన్నపేట మండలం దేవాది విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో నిర్వహణ పనుల కారణంగా శనివారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని టెక్కలి ఈఈ నర్సింహకుమార్ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గోపాలపెంట, పోతయ్యవలస, మడపాం, బుచ్చిపేట గ్రామాల్లో సరఫరా నిలిచివుంటుందని వినియోగదారులకు సూచించారు. పనులు పూర్తి అయిన వెంటనే సరఫరా ప్రారంభిస్తామన్నారు.