VIDEO: గొప్పవాళ్ళు కావాలంటే కష్టపడాలి: హరీష్ రావు
SDPT: గొప్పవాళ్ళు కావాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడాలని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శనివారం సిద్దిపేటలో జరిగిన ఒక ప్రైవేట్ పాఠశాలలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గొప్పవారు కావాలంటే తల్లిదండ్రులు, గురువుల మాట వినాలని సూచించారు. వారు చెప్పిన విషయాలను నేర్చుకొని, పాటించాలని అన్నారు. కష్టపడితేనే లక్ష్యాలను చేరుకోవచ్చని ఆయన యువతకు పిలుపునిచ్చారు.