నేడు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
ప్రకాశం: కనిగిరిలో అమరావతి గ్రౌండ్ నందు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో కంటి జబ్బులతో బాధపడుతున్న వృద్ధులకు నేడు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరం కొనసాగుతుందన్నారు. వృద్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.