మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
AKP: మునగపాక మండలం పాటిపల్లి మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి ఓ ప్రకటంలో తెలిపారు. ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చే నెల 12వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మోడల్ స్కూల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.