VIDEO: మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన
నిర్మల్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. నేడు అధికారులు పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అర్హుల జాబితాను వెల్లడిస్తారు. తిరస్కరణకు గురైన వారు ఆదివారం అప్పీలు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందని, అనంతరం పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారన్నారు.