మే 2న చాగంటి ప్రవచనాలు
VSP: మే 2న అనంత పద్మనాభ స్వామి ఆలయంలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు జరుగనున్నాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం పద్మనాభంలో పర్యటించారు. సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.