రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే

కోనసీమ: రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు గ్రామంలో ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై ఇస్తున్న పవర్ టిల్లర్‌లను మంగళవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అనేక రకాల పథకాలను కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు.