ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
KKD: పిఠాపురంలో వేధింపుల కేసులో పోలీసు విచారణకు హాజరైన జి. సతీష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం పోలీసు విచారణకు హాజరైన సతీష్, అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు అతడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. గురువారం సాయంత్రం చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.