మానవత్వం చాటుకున్న యువత

మానవత్వం చాటుకున్న యువత

WNP: కేతేపల్లి నుంచి వనపర్తి బైక్‌పై వెళ్తున్న దంపతులు ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపుతప్పి కింద పడటంతో గర్భిణితోపాటు చిన్నారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానిక యువత తక్షణమే స్పందించి, వారిని సమీపంలోని క్లినికు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.