తొక్కిసలాట ఘటన.. మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
SKLM: కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయ తొక్కిసలాటలో బాధితులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఘటనలో 9 మంది మరణించగా, 13 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ₹5 లక్షలు, గాయపడినవారికి ₹50 వేల ఆర్థిక సహాయం అందిస్తుంది. కాగా, కార్తీక శనివారం, ఏకాదశి సందర్భంగా వేలమంది భక్తులు ఒక్కసారిగా చేరడంతో రెయిలింగ్ విరిగి ప్రమాదం జరిగింది.