ఈ నెల 27 న జాబ్ మేళా

ఈ నెల 27 న జాబ్ మేళా

SKLM: ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఈ నెల 27వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కెప్టెన్ డా. పోలినాయుడు బుధవారం ప్రకటనలో తెలిపారు. ప్రముఖ 12 కంపెనీలు హాజరవుతున్నాయన్నారు. సుమారు 850 ఖాళీలకు నియామకాలు జరుపనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ, ఎంఎల్డీ తదితర విద్యార్హతలు కలిగి ఆసక్తి కల అభ్యర్థులు అర్హులన్నారు.