మూడు రోజుల్లో యూరియా అందిస్తాం: మార్కెట్ ఛైర్మన్

MLG: తాడ్వాయి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయాన్ని ఈరోజు వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ రేగ కళ్యాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ మేరకు రిజిస్టర్లను పరిశీలించిన ఆమె, గత సంవత్సరం 1,000 టన్నుల యూరియా సరిపోయినా, ఈసారి 20 వేల ఎకరాల సాగు (7,500 ఎకరాల మొక్కజొన్న)తో కొరత ఏర్పడిందని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, 3 రోజుల్లో యూరియా అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.